రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ


భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో పాటు రజనీష్ అగర్వాల్‌ను కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఒడిశాలో ఇటీవల బీజేడీని వీడి బీజేపీలో చేరిన మాజీ నేత దేవాశిష్ సామంత్రాయ్‌ను, అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై తగక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్‌భాయ్ రాథ్వా, మాన్సింగ్ పర్మార్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. రాజస్థాన్‌లో ఆల్కా గుర్జర్, సతీశ్ పూనియాలకు అవకాశం కల్పించింది. మణిపూర్ నుంచి ఏ. శారదా దేవిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org