Ad Code

ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి  మాట్లాడుతూ ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే బీమా రక్షణ పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు బీమా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకూ సింగరేణిలో 45 మంది కార్మికులకు ప్రమాద బీమా అందించామన్నారు. ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. తనను రేవంతన్న అని పిలిస్తే సంతోషంగా ఉంటుందన్నారు. తాను ఒకప్పుడు జెడ్పీటీసీనని, ఆ తర్వాత ఎంపీనని, ఇప్పుడు సీఎంనని రేవంత్‌ అన్నారు. పదవులు ఇలా మారుతూ ఉంటాయని, అందుచేత రేవంతన్న అనేది శాశ్వతంగా ఉంటుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu