Ad Code

నష్టాల ఊబి నుండి లాభాల్లోకి దూసుకెళ్లిన ఎస్.కె హైనిక్స్

క్షిణ కొరియాలోని శామ్ సంగ్ అతి పెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ కంపెనీకి తిరుగులేదు. గడిచిన 20 సంవత్సరాలుగా మార్కెట్ విలువను పెంచుకుంటూ లీడింగ్ స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీని అధిగమించడం పెద్దపెద్ద సంస్థల వల్ల కూడా కాలేదు. అయితే ఇప్పుడు ఈ కంపెనీని దాటి.. ఒక సంస్థ ఎదిగింది. అద్భుతాన్ని కళ్ళ ముందు ఉంచింది. అంతేకాదు అప్పుల ఊబి నుంచి కోట్ల లాభాలను అందిపుచ్చుకుంది. అదే కాదు ఏకంగా శామ్ సంగ్ కంపెనీకే ఎస్.కె హైనిక్స్ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీ పేరు . ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగంలో చిప్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏ ఐ బూమ్ కూడా తోడు కావడంతో చిప్ లకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్.కె హైనిక్స్ ఈ బూమ్ ను అందిపుచ్చుకుంది. మార్కెట్ గిరాకిని అనుసరించి రకరకాల చిప్ లు తయారు చేయడం మొదలుపెట్టింది. చివరికి సాంసంగ్ కంపెనీకి షాక్ ఇచ్చింది. ఎస్.కె హైనిక్స్ కంపెనీ మార్కెట్ విలువ 2082.5 ట్రిలియన్ వాన్ లు. డాలర్ ప్రకారం చూసుకుంటే 1.35 ట్రిలియన్లు. సాంసంగ్ విలువ 2081.3 ట్రిలియన్ వాన్ లు గా ఉంది. 2000 సంవత్సరం నుంచి దక్షిణ కొరియాలో అతిపెద్ద కంపెనీగా సాంసంగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దీనిని హైనిక్స్ అధిగమించింది. ఒకవేళ తమ ప్రిఫర్డ్ షేర్లను లెక్కిస్తే విలువ అధికంగా ఉంటుందని సాంసంగ్ కంపెనీ చెబుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లో కీలకమైంది హై బ్రాండ్ విత్ మెమొరీ చిప్స్. వీటిని హైనిక్స్ కంపెనీ తయారు చేస్తోంది. గూగుల్.. ఎన్ వీడియా వంటి కంపెనీలకు హైనిక్స్ సరఫరా చేస్తోంది. హై బ్యాండ్ విడ్త్ మెమొరీ చిప్స్ మార్కెట్లో దాదాపు 61 శాతం హైనిక్స్ కంపెనీకి ఉంది. ఇందులో సాంసంగ్ 17%.. మైక్రోన్ కంపెనీకి 21 శాతం వాటా ఉంది. హైనిక్స్ కంపెనీని 1983లో హ్యుందాయ్ ఏర్పాటు చేసింది. 2003 వరకు ఈ కంపెనీ తీవ్రమైన నష్టాలలో కూరుకుపోయింది. ఒక దశలో కంపెనీని మూసివేద్దామనుకున్నారు. మైక్రాన్ అనే కంపెనీకి అమ్ముదామని భావించారు. అనుకోకుండా డీల్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత 2003లో hyundai కంపెనీ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఎస్.కె గ్రూప్ దీనిని దక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ కంపెనీ రూపురేఖలు మారిపోయాయి. ఇదే ఊపులో ఎస్.కె హైనిక్స్ త్వరలోనే అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది.

Post a Comment

0 Comments

Close Menu