సీఎం విజయ్ ను కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఖుష్బూ దంపతులు


మిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో నటి ఖుష్బూ, ఆమె భర్త సుందర్ సీ కలిసి తమ కుమార్తె వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఆ సమయంలో ఖుష్బూ దంపతుల వెంట వారి కుమార్తెలు అవంతిక, ఆనందిత, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాస్ ఉన్నారు. తన ఇంటికి వచ్చిన ఖుష్బూ, సుందర్ ను విజయ్ సాదరంగా ఆహ్వానించి, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విజయ్ తో కలిసిన ఫొటోలను ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. విజయ్ ను సోదరుడిగా అభివర్ణించారామె. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుమార్తె వివాహ మహోత్సవానికి విజయ్ ను ఆహ్వానించడం ఓ ప్రత్యేక, మరపురాని రోజుగా పేర్కొన్నారు. విజయ్ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఈ సందర్భంగా ఖుష్బూ దంపతులు వ్యక్తపరిచారు. విజయ్ తో చిరకాల అనుబంధం ఉందని, ఆయనను కలిసిన ప్రతిసారీ తమ మనసులు గర్వంతో, ఆనందంతో నిండిపోతాయని ఖుష్బూ పేర్కొన్నారు. తమతో పాటు పిల్లలు కూడా రావడంతో విజయ్ ఎంతో సంతోషించారని, తన కుమార్తెలు, ఆయనపై నుంచి చూపు తిప్పుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org