రైల్వే సూపర్ యాప్ 'రైల్‌వన్' ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్‌రిజర్వ్‌డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రూపొందించింది. గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్‌ఫ్రీ ఇంటర్‌ఫేస్‌ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. చాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్‌లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్‌ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్‌రిజర్వ్‌డ్, నప్లాట్‌ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీ వెరిఫైడ్ పార్ట్‌నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా పదికి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌ను వాడుకునే సదుపాయం ఉంది.
0 Comments