Ad Code

వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో గొంతు నులిమి భార్య హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదోని వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అమరావతి నగర్‌కు చెందిన నల్లబోతుల మహేష్‌ బళ్లారి ఈరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఈరమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహేష్‌కు తెలిసిన తర్వాత దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ మద్యం సేవించి భార్యతో వాగ్వాదానికి దిగేవాడని పోలీసులు తెలిపారు. భర్త తన సంబంధానికి అడ్డంకిగా మారుతున్నాడని భావించిన ఈరమ్మ, అతడిని పొలానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. మృతుడి అక్క చిట్టెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Post a Comment

0 Comments

Close Menu