తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. 'కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైల్ విస్తరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తా' అని ఎక్స్‌లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
0 Comments