Ad Code

భార్యను గొంతు కోసి చంపి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త


హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ఖైతలాపూర్‌లోని డబుల్ బెడ్ రూమ్స్ ప్రాంతంలో ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. రహీమ్, సుమేరా దంపతులకు 2024లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. వృత్తిరీత్యా రహీమ్ ఆటో డ్రైవర్‌. రహీమ్‌కు, అతని భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున కూడా దంపతులిరువురి మధ్య గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ఆగ్రహానికి గురైన రహీమ్ భార్య సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపైన కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu