Ad Code

హెల్మెట్ ధరించినా ఉన్నా దక్కని ప్రాణం : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం!

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను సామర్లకోటకు చెందిన జోరెడ్డి వెంకట సూర్యనారాయణ, అరుణ కుమారిగా గొల్లప్రోలు పోలీసులు గుర్తించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సూర్యనారాయణ హెల్మెట్ ధరించే బైక్ నడుపుతున్నారు. వారు చేబ్రోలు నుంచి కత్తిపూడి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక వేగవంతమైన టిప్పర్ లారీ వీరి యాక్సిస్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ రోడ్డుపైకి తూలి పడ్డారు. దురదృష్టవశాత్తూ, ఆయన హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ, లారీ భారీ చక్రాలు నేరుగా ఆయన తల మీదుగా దూసుకుపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణరక్షణ కవచంగా భావించే హెల్మెట్ ఉన్నా కూడా, లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు దక్కకపోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.

Post a Comment

0 Comments

Close Menu