స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మిని నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న శ్రీలక్ష్మికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమెను గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చింది. ఆ సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో శ్రీలక్ష్మి దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి పోస్టింగ్ లేకుండా కొనసాగారు. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందు జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించడం ఆసక్తికరంగా మారింది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org