Ad Code

చిట్టీల పేరుతో 94 మందిని మోసం చేసి రూ.4 కోట్లను దండుకున్న దంపతుల అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చిట్టీల పేరుతో సుమారు రూ.4 కోట్ల మేర భారీ మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. కృష్ణపట్నం ప్రాంతానికి చెందిన చల్లా గంగమ్మ, ఏడుకొండలు దంపతులు గత కొంతకాలంగా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. నమ్మకమైన మాటలతో నమ్మించి, సుమారు 94 మంది బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అయితే, చిట్టీల గడువు ముగిసినప్పటికీ బాధితులకు డబ్బులు చెల్లించకుండా, సమాధానం చెప్పకుండా ఈ దంపతులు తప్పించుకు తిరగడం ప్రారంభించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులంతా ఒక్కటయ్యారు. బాధితులంతా కలిసి ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న చిట్టీల నిర్వాహకులు చల్లా గంగమ్మ, ఏడుకొండలు దంపతులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu