అమెజాన్, షియోమీ వెబ్సైట్ లో రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం

రెడ్‌మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 37,999 ధరతో మరియు హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 40,999 లో లాంచ్ చేసింది. ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ టర్బో వైట్, ఆస్పాల్ట్ బ్లాక్ మరియు నైట్రో బ్లూ అనే మూడు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. ఈరోజు నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు షియోమీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది. ఈ కొత్త ఫోన్ పై షియోమీ మొత్తం మూడు ఆఫర్స్ అందించింది. మొదటిది రూ. 2,000 రూపాయల HDFC, BOB, Axis, SBI, Kotak మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్. రెండోది 9 నెలల No Cost EMI ఆఫర్. మూడవది 60% బై బ్యాక్ వాల్యూ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. అదనంగా, ఈ ఫోన్ పై 3 నెలల Spotify ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ని ఉచితంగా అందిస్తుంది. ఈ రెడ్‌మీ లేటెస్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ Dimensity 8500 Ultra ప్రాసెసర్ తో వచ్చింది. 23 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్ ఈ ప్రాసెసర్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 12 LPDDR 5X ర్యామ్ మరియు 256GB UFS 4.1 స్టోరేజ్ తో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో Android 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం తగిన ఫీచర్స్ కలిగిన కాంపాక్ట్ స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంది. అదేమిటంటే,ఈ ఫోన్ 6.59 ఇంచ్ కాంపాక్ట్ సైజు AMOLED సూపర్ సన్ లైట్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, గొప్ప విజువల్స్ కోసం 1.5K మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. అదనంగా, ఈ మూవీ లెవల్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం HDR10+, HDR Vivid మరియు Dolby Vision వంటి గొప్ప ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ లో 50MP (OIS) మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, 20MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో ఉంటుంది. ఇది 4K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లతో పటు షియోమీ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ లో భారీ 7560 mAh బ్యాటరీని 100W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains