ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన 25 కిలోల బరువున్న కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. అరుదుగా లభించే ఈ చేపను హార్బర్‌లో వేలం వేయగా, పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్థానిక మత్స్యకారుల కథనం ప్రకారం, కచిడి చేప పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. రెండు నెలల వేట విరామం అనంతరం ఇలాంటి విలువైన చేప వలకు చిక్కడం శుభ సూచకమని వారు ఆనందం వ్యక్తం చేశారు.
0 Comments