Ad Code

భూ సర్వే కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్‌

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం అమ్మన్‌గుర్తి గ్రామంలో  భూమి కొలతల కోసం లంచం తీసుకున్న మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విడతల వారిగా బాధితుడు నుంచి రూ. 25 వేలు తీసుకున్న మండల సర్వేయర్‌ ఎక్కలదేవి కుమార స్వామితో పాటు, మరో ఇద్దరు ప్రైవేట్‌ సర్వేయర్లు తీగల రాజేశ్‌, వంగ విహిత్‌ రెడ్డిని పట్టుకున్నారు. బాధితుడు తన భూమికి సంబంధించిన సర్వే చేయాలని సంప్రదించగా గత మే నెల నుంచి మూడు విడతలుగా మండల సర్వేయర్‌ లంచం తీసుకున్నాడు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కరీంనగర్‌ ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.


Post a Comment

0 Comments

Close Menu