దేశీయ మార్కెట్లో ఒప్పో 'రెనో ' సిరీస్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. వచ్చే నెలలో గ్లోబల్ మార్కెట్లో సరికొత్త 'ఒప్పో రెనో 16' సిరీస్ లాంచ్ కావడానికి లైన్ క్లియర్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను అందించేలా 'ఒప్పో రెనో 16c' అనే సరికొత్త మోడల్‌ను ఇండియాలో దించబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం. గత 'రెనో 15' సిరీస్ సమయంలోనూ ఒప్పో ఇదే ఫార్ములాను వాడింది. అప్పట్లో తక్కువ ధరలోనే పెద్ద డిస్‌ప్లేతో వచ్చిన 'రెనో 15c' మోడల్ మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు రాబోయే 'రెనో 16c' కూడా అదే బాటలో నడవనుంది. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఇండియాలో ఈ ఫోన్ ధర 8GB + 256GB వేరియంట్ రూ. 34,999 కి, అలాగే 12GB + 256GB వేరియంట్ రూ. 37,999 కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇండోనేషియా, మలేషియా మార్కెట్లలో లాంచ్ కాబోతున్న 'రెనో 16F' మోడల్ ఫీచర్లను పోలి ఉంటుందని అంచనా. ఇందులో 6.57-ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. చైనాలో లాంచ్ అయిన బేస్ మోడల్ 6.32 ఇంచులు కంటే కూడా దీని స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉండటం విశేషం. ఇక ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ అస్సలు లాగ్ అవ్వకుండా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీని వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. ఇందులో మెయిన్ కెమెరా 50-మెగాపిక్సెల్ ఉంటుంది. దీనివల్ల ఫోటోలు అస్సలు షేక్ అవ్వకుండా నీట్‌గా వస్తాయి. దీంతో పాటు దూరం ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, , గ్రూప్ ఫోటోల కోసం 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను అమర్చారు. ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ కూడా ఏకంగా 50-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం ఈ ఫోన్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్. దీని బ్యాటరీ లైఫ్. ఇందులో ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీని ఇస్తున్నారు. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఇస్తే ఫోన్ బరువు పెరుగుతుంది, కానీ ఒప్పో దీని డిజైన్‌ను చాలా స్లిమ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. భద్రత పరంగా చూస్తే ఈ ఫోన్‌కు అత్యుత్తమమైన IP69 రేటింగ్ ఇచ్చారు. అంటే ధూళి, హై-ప్రెజర్ వాటర్ స్ప్రేల నుంచి కూడా ఈ ఫోన్‌కు ఎలాంటి ముప్పూ ఉండదు. ప్లాస్టిక్ ఫ్రేమ్, అదిరిపోయే సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు, ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌తో వస్తుంది.
0 Comments