Ad Code

ఐపీఓ డాక్యుమెంట్‌కు బోర్డు ఆమోదం : ముకేశ్ అంబానీ ప్రకటన

జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ డాక్యుమెంట్‌కు బోర్డు ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించిన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి సమర్పించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ బోర్డు జియో ఐపీఓకు ఆమోదం తెలిపింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ను ఈరోజు ఫైల్ చేస్తున్నాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఇషా అంబానీ, ఆనంద్ అంబానీ, ఆకాష్ అంబానీలు ముందుండి నడిపిస్తారు అని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ నుండి వస్తున్న మొదటి లిస్టింగ్ ఇదే కావడం విశేషం. జియో లిస్టింగ్ ద్వారా భారతదేశం కూడా అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక కంపెనీలను నిర్మించగలదని ప్రపంచానికి నిరూపితమవుతుంది. కాబోయే కొత్త ఇన్వెస్టర్లందరికీ నేను హామీ ఇస్తున్నాను. జియోకు మరింత అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu