హైదరాబాద్‌లో సినిమాలో నటించాలనే యువతి తాపత్రయాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు ఛాన్సుల పేరిట నమ్మించి, షూటింగ్ చేయించుకుని, తీరా పారితోషికం అడిగితే కారులో ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. టోలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోన్న ఈ ఘోర పాడుకృత్యం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతికి ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సదరు నటి 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన షూటింగ్‌లో పాల్గొంది. అయితే, సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ప్రసాద్ అసలు రంగు బయటపెట్టాడు.ఆమెకు ఇవ్వాల్సిన రూ. 90 వేల పారితోషికంతో పాటు, ప్రయాణ ఖర్చుల కింద రావాల్సిన మరో రూ. 38 వేలు , మొత్తం రూ. 1.28 లక్షలు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకుంటూ కాలయాపన చేశాడు.
0 Comments