Ad Code

భార్యను నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త


కోదాడ బస్టాండ్ సమీపంలో భార్యను నడిరోడ్డుపై కత్తితో పొడిచి భర్త కిరాతకంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బాబునగర్‌కు చెందిన మణిదీప్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు జగ్గయ్యపేటకు చెందిన శిరీష (24)ను ప్రేమించి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన గొడవ నేపథ్యంలో శిరీష, ఆమె పెద్దమ్మ, మణిదీప్ కలిసి కోదాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్దిచెప్పి పంపించారు. అయితే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘోరం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట వెళ్లేందుకు శిరీష ఆటో ఎక్కగా, మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగి కత్తితో దాడి చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu