ఎల్పీజీ నింపుతుండగా పేలిన ఓమ్ని కారు


తెలంగాణలోని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓమ్ని లో ఎల్పీజీ  నింపుతుండగా ట్యాంక్ పేలింది. దీంతో భారీ శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఓమ్ని, ఒక కారు, ఒక బైక్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. పోలీస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org