యువ జడ్జి మన్ కుమార్ శర్మ ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఢిల్లీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న అమన్ కుమార్ శర్మ (30) తన నివాసంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఆయన భార్య కూడా న్యాయాధికారేనని తెలిసింది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొందని, కోడలి సోదరి అయిన ఐఏఎస్‌ అధికారి జోక్యం చేసుకోవడంతో తన కుమారుడు వేదనకు గురయ్యాడని, భార్య వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని అమన్‌ తండ్రి ఆరోపించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default