Ad Code

ప్రజాప్రతినిధుల పేర్ల ముందు 'గౌరవనీయులైన' పదాలు తప్పనిసరి !


మాజీ కేంద్రమంత్రులు, ఎంపీల పేర్ల ముందు గౌరవప్రదమైన పదాలను తప్పనిసరిగా చేర్చాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం సంబోధనల్లోనే కాకుండా, పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లలో సైతం 'గౌరవనీయులైన'  అనే పదాన్ని వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల పేర్ల ముందు తగిన గౌరవ సూచక పదాలు లేకుండా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులపై కనీస గౌరవం , మర్యాద పాటించడం అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టసభల సభ్యులు, మాజీ మంత్రుల విషయంలో ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని అధికారులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu