కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 16 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, ఎన్డీఏ కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో ఎన్.ఆర్. కాంగ్రెస్ 12 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, అన్నాడీఎంకే, లక్ష్య డెమోక్రటిక్ పార్టీ ఒక స్థానంలో గెలిచాయి. ఇండియా కూటమిలో డీఎంకే 5 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ గెలిచింది. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి తాను పోటీ చేసిన తట్టాంచావడి, మంగళం రెండు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించారు.
0 Comments