Ad Code

అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌకను కాపాడిన పాకిస్తాన్ నేవీ


రేబియా సముద్రంలో చిక్కుకుపోయిన భారత్ కు చెందిన ఓ నౌకను పాకిస్తాన్ నేవీ తక్షణమే స్పందించి కాపాడింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ తన కథనంలో వెల్లడించింది. ఒమన్ నుంచి అరేబియా సముద్రం గుండా భారత్ కు వస్తున్న ఎంవీ గౌతమ్ అనే భారత్ కు చెందిన ఆఫ్ షోర్ టగ్ అండ్ సప్లై వెసెల్ లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో నౌకలో ఆరుగురు భారతీయులు, ఒక ఇండోనేషియన్ సిబ్బంది ఉన్నారు. అయితే నౌక ప్రమాదంలో ఉందని గుర్తించిన ముంబైలోని మేరిటైమ్ రెస్క్యూ కో- ఆర్డినేషన్ సెంటర్.. ఈ మేరకు పాకిస్తాన్ నేవీని కాపాడాలని రిక్వెస్ట్ చేసింది. దాంతో తక్షణమే స్పందించిన పాకిస్తాన్ అధికారులు పాకిస్తాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ సాయంతో రంగంలోకి దిగింది. రక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు నౌకలోని సిబ్బందికి పాకిస్తాన్ నేవీ ఎమర్జెన్సీ సాయం చేసింది. అందులో ఆహారం, వైద్యం, సాంకేతిక సదుపాయం అందించింది. పాకిస్థాన్ అరేబియా సముద్రంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఆపదలో ఉన్న నావికులకు ఊరట లభించినట్టు అయింది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఇలాంటి సహాయక చర్యలు చేయడం ఇది రెండోసారి గత నెలలో 18 మంది సిబ్బందితో వెళ్తున్న ఓ నౌక ప్రమాదంలో పడగా ఇలాగే పాకిస్తాన్ నేవీ వారిని కాపాడింది.

Post a Comment

0 Comments

Close Menu