Ad Code

భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు హల్ చల్ : గంటపాటు వాహనాల రాకపోకలకు ఆటంకం


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఆదివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు సంచారంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించాయి. అటవీశాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాం లోకే తరిమేందుకు బాణాసంచా పేల్చినప్పటికీ మొరాయించాయి. చివరకు రోడ్డు దాటుకుని ఏనుగుల గుంపు వెళ్ళడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అందులో రెండు అంబులెన్సులు ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో అటవీ, పోలీసు శాఖ అధికారులు ఏనుగులను రహదారిపై నుండి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసి రాకపోకలను క్రమబద్దీకరించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి రాత్రిపూట ప్రయాణికులకు, వాహన చోదకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొద్దిరోజుల పాటు గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాత్రివేళలో భాకరాపేట ఘాట్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu