కరీంనగర్ ఘటన : తెలంగాణ డీజీపీ సీ.వీ ఆనంద్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బీఆర్ఎస్ నేతల మీద జరగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ డీజీపీ సీ.వీ ఆనంద్ ను కలిశారు. నిన్న కరీంనగర్‍లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ దాడితో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సంబంధం ఉందని అందువల్ల కేంద్ర మంత్రిని నిందితుడిగా చేర్చి ఎఫ్‍ఐఆర్ నమోదు చేయడంతో పాటు కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన వినపతి పత్రాన్ని డీజీకి అందజేశారు. మే 4వ తేదీన కరీంనగర్‌లో పట్టపగలే ఒక జ్యువెలరీ షాపులో సాయుధ దోపిడీ జరిగిందని, ఆ బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారని లేఖలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గుర్తు చేశారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు స్థానిక పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ విమర్శించింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం