తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రేమికులను బెదిరించిన ఇద్దరు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడి, వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. సీఐ గాంధీ నాయక్ తెలిపిన వివరాల మేరకు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన ఓ యువకుడు, బాలిక (17) మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి వచ్చారు. వీరిని అక్కడే పని చేస్తున్న ఇద్దరు కూలీలు అశోక్ కుమార్ (26), లక్ష్మణ్ (27) గమనించి, ప్రేమ జంటను డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అనంతరం యువకుడి ముందే బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
0 Comments