హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
0 Comments