Ad Code

బాలికపై అత్యాచారం : నలుగురిపై పోక్సో కేసు నమోదు


ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, నలుగురిలో అల్లరి చేస్తామని బెదిరించి మరో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిపైన పోక్సో కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పాలకోడేరు మండలానికి చెందిన ఒక బాలిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకట గణేష్ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2024 నుంచి పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఇదే అదునుగా గణేష్ స్నేహితుడు దుర్గ మహేష్ (బాబి) బాలికను బలవంతంగా లోబరుచుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన భోగేశ్వరరావు కూడా ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను భయపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గొరగనుమూడి గ్రామo ఈనెల 9న రైల్వే గేటు సమీపంలో సపోటా తోటలోకి బాలికను బలవంతంగా లాక్కొనివెళ్లి బలాత్కారం చేయడానికి ప్రయత్నంచగా ఆమె పారిపోయి ఇంటికి చేరింది. బాలిక ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు రావడంతో ఈ నెల 15న భీమవరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతిగా వైద్యులు తేల్చారు. దీంతో బాలికను నిలదీయడంతో ఈ దారుణం బయటపడింది. ఆమె తల్లి దండ్రుల ఫిర్యాదు ఆధారంగా విచారణ నిర్వ హించి నలుగురిపై పోక్సో చట్టంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్ఐ రవి వర్మ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu