జియో 448 రూపాయల ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇందులో ఎటువంటి ఇంటర్నెట్ డేటా లభించనప్పటికీ, అపరిమితంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు ఉంది. కాల్స్, సందేశాల సేవలు కావాలనుకునే వారికి ఇది తక్కువ ఖర్చుతో కూడిన ఉత్తమ మార్గం. ఒకవేళ అత్యవసరంగా డేటా అవసరమైతే, కేవలం 11 రూపాయల నుంచి ప్రారంభమయ్యే డేటా ప్యాక్‌లతో విడిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. నెలవారీ రీఛార్జ్ చేయకపోతే సిమ్ కార్డులు నిష్క్రియం అయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఆ నంబర్లు ఇతరులకు కేటాయించబడవచ్చు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే 84 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ అద్భుతమైన ఎంపిక. గతంలో కేవలం నంబర్ యాక్టివ్‌గా ఉండటానికి చేసే రీఛార్జ్ పద్ధతుల కంటే ఇది మెరుగైనది. ఎందుకంటే ఇందులో మీరు నంబర్ యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా, పూర్తిస్థాయిలో కాల్స్, సందేశాలను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం కాలింగ్, సందేశాలకే పరిమితం కాదు. వినియోగదారులు జియో టీవీ ద్వారా వినోదాన్ని పొందవచ్చు. అలాగే జియో క్లౌడ్ సేవలను ఉపయోగించి ఫోన్ లోని ముఖ్యమైన ఫోటోలు లేదా సమాచారాన్ని భద్రపరుచుకోవచ్చు.
0 Comments