Ad Code

భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5 ?


దేశీయ మార్కెట్‌లో షావోమీ 7,560mAh భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5ని విడుదల చేయబోతోంది. దీని టీజర్ తో  హెవీ యూజర్లలో ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే టెక్ క్రియేటర్లు ఈ ఫోన్‌పై రకరకాల డ్రెయిన్ టెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఇండియాలో iQOO, రియల్‌మీ, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్లు 6,000mAh, 7,000mAh బ్యాటరీలతో ఫోన్లను లాంచ్ చేశాయి. అయితే, రెడ్‌మీ టర్బో 5 వీటన్నింటికంటే ఎక్కువ కెపాసిటీతో వస్తోంది. ముఖ్యంగా గేమర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారిని దృష్టిలో పెట్టుకుని షావోమీ ఈ ఫోన్‌ను తెస్తోంది. మాటిమాటికీ ఛార్జింగ్ పెట్టే పని లేకుండా, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. ఇది పర్ఫార్మెన్స్‌లో కొత్త ప్రమాణాలను సెట్ చేయబోతోంది. ఈ డివైజ్‌పై స్క్రీన్ ఆన్ టైమ్ టెస్టులు చేసేందుకు ఇండియన్ యూట్యూబర్లు రెడీ అవుతున్నారు. BGMI వంటి హెవీ గేమ్స్‌ను గంటల తరబడి ఆడి, 90Hz గ్రాఫిక్స్ మరియు హై బ్రైట్‌నెస్‌లో బ్యాటరీ ఎలా పనిచేస్తుందో చెక్ చేయనున్నారు. సాధారణంగా 7,000mAh బ్యాటరీలే స్టాండ్‌బైలో రెండు రోజులకు పైగా వస్తాయి. ఇండియాలో ప్రస్తుతం 33W నుంచి 120W వరకు ఛార్జింగ్ స్పీడ్ ఉన్న ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బ్యాటరీ పెద్దదైతే ఛార్జింగ్ ఎక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో ఫోన్ హీట్ అవ్వకుండా షావోమీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూడాలని యూజర్లు ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ హీటింగ్ ఇష్యూస్ లేకుండా మేనేజ్ చేస్తే, ట్రావెలర్స్ మరియు స్టూడెంట్స్‌కు ఈ ఫోన్ టాప్ ఛాయిస్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu