Ad Code

ఎస్‌-400 మిస్సైల్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ఇండియా


భారత రక్షణ వ్యవస్థకు రష్యా తోడ్పాటునందిస్తూ వస్తోంది. ఇండియాకు అవసరమైన కొన్ని యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వంటివి రష్యా సరఫరా చేస్తోంది. ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్‌-400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలకమైనవి. వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని ఇండియాకు రష్యా అందించాలి. 2023 వరకు మూడు రక్షణ క్షిపణి వ్యవస్థల్ని అందించింది. ఇంకో రెండు ఎస్‌-400 మిస్సైల్స్ సిస్టమ్స్ ఈ పాటికే రావాలి. కానీ, రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వీటిని సమయానికి అందించలేకపోయింది. దీంతో ఈ వ్యవస్థల్ని త్వరగా అందించాలని రష్యాను ఇండియా కోరింది. అంతేకాదు.. మరిన్ని ఎస్‌-400 మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు కూడా ఇండియా మొగ్గు చూపుతోంది. ఈ అంశంపై రష్యాకు చెందిన ఎఫ్‌ఎస్‌వీటీఎస్ (ఫెడరల్ సర్వీసెస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోపరేషన్) సంస్థతో ఇండియా చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ కూడా వెల్లడించింది. రష్యా నుంచి ఇలాంటి మరింత అదనపు వ్యవస్థల్ని కొనుగోలు చేయాలని ఇండియా భావిస్తోంది. ఇక మిగిలిన ఎస్‌-400 మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను త్వరలోనే అందిస్తామని ఎఫ్‌ఎస్‌వీటీఎస్ చీఫ్ దిమిత్రీ షుగయేవ్ ఇటీవల తెలిపారు. నిజానికి ఇవి ఈ నెలలోనే రావాలి. కానీ, వచ్చే నవంబర్ నాటికి అందజేస్తామని తాజాగా రష్యా వెల్లడించింది. అలాగే, ఇండియా కోరినట్లు అదనపు మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని దిమిత్రీ తెలిపారు. ఈ మిస్సైల్స్‌ సిస్టమ్స్‌ రష్యా తయారు చేసిన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. అంటే శతృవులు ప్రయోగించి క్షిపణుల్ని గుర్తించి, గాలిలోనే ఈ వ్యవస్త నాశనం చేయగలదు. దూరం నుంచి వచ్చే ఎయిర్‌క్రాఫ్ట్స్, డ్రోన్లు, మిస్సైల్స్, ఖండాంతర క్షిపణుల్ని ఇది అడ్డుకోగలదు. ఇండియా తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu