ఆంధ్రప్రదేశ్ లోని కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంగడివీధికి చెందిన ప్రధాన విక్రయదారులు మాధవ, సాకే శంకర్లతో పాటు మనోజ్ కుమార్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 1.600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు, అవసరమైతే నగరం నుంచి బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడబోమని పోలీసులు స్పష్టం చేశారు.
0 Comments