Ad Code

ఏప్రిల్‌లో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1,399.43 కోట్లు : గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధిక ఆదాయం


తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల, స్టాంపుల శాఖ ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేని విధంగా రూ.1,399.43 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. గత పదేళ్ల కాలంలో ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఆదాయం ఇదే కావడం విశేషం. అంతకుముందు 2022-23 ఏప్రిల్‌లో వచ్చిన రూ.1,342 కోట్లే అత్యధికం. గడిచిన ఆర్థిక సంవత్సరం లో కూడా ఈ శాఖ అద్భుతమైన పనితీరు కనబరిచింది. మార్చి 31, 2026 నాటికి మొత్తం రూ.15,262.27 కోట్ల వార్షిక ఆదాయం సమకూరింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.46 శాతం అధికం. ఈ వృద్ధి రాష్ట్ర ఆర్థిక పురోగతికి , రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 16.61 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ స్లాట్ బుకింగ్ పద్ధతిని పటిష్టం చేయడంతో, దళారుల ప్రమేయం తగ్గి నేరుగా ఖజానాకు ఆదాయం మళ్లుతోంది. ఐజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల లావాదేవీల వేగం పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. గతంలో మార్చి నెలాఖరులో మాత్రమే ఇలాంటి రద్దీ ఉండేది, కానీ ఈసారి ఏప్రిల్‌లో కూడా అదే స్థాయి జోరు కొనసాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,000 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Post a Comment

0 Comments

Close Menu