గుడివాడ అమర్‌నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించిన విశాఖ కోర్టు


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై పదేళ్ల క్రితం నమోదైన ఒక పాత కేసులో దోషిగా తేల్చుతూ విశాఖ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇందులో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016 ఏప్రిల్‌ నెలలో గుడివాడ అమర్‌నాథ్‌ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం సాక్షిగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నాలుగు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అమర్‌నాథ్ ఆరోగ్యం క్షీణించడాన్ని గమనించిన పోలీసులు, ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, నిరాహార దీక్ష ద్వారా ప్రాణాలకు హాని తలపెట్టుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో విశాఖ టూటౌన్‌ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గత ఎనిమిదేళ్లుగా సాగుతోంది. తాజాగా ఈ కేసుపై తుది విచారణ పూర్తి చేసిన విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి కీలక తీర్పును వెలువరించారు. అమర్‌నాథ్‌పై మోపబడిన ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ, ఆయనకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ జరిమానా చెల్లించని యెడల అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పుపై గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ.. ప్రజల ప్రయోజనాల కోసం, రైల్వే జోన్ సాధన కోసం తాను చేసిన పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదన్నారు. తమ పోరాట ఫలితంగానే విశాఖకు రైల్వే జోన్ మంజూరైందని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పును గౌరవిస్తూనే, న్యాయ సలహా మేరకు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains