అనసూయ ఫిర్యాదుతో సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడు అరెస్ట్ !


నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో సాగుతున్న అసభ్యకర ప్రచారానికి సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించి మరో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అనసూయపై పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన దొరెపల్లి చంటి. ఇతను ‘చంటిదొరెపల్లి’ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇటీవలె కడప జిల్లాకు చెందిన జనార్ధన్ అనే వ్యక్తిని కూడా ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుమారు 70 మందికి పైగా వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై అనసూయ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక్కొక్కరినీ గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org