Ad Code

టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలు


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం బస్సులను నిలిపివేసి ఆందోళనలు బాట పట్టడంతో, సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా వేసవి సెలవుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉండటం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించుకుని బస్సులను రోడ్డెక్కించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా అన్ని జిల్లాల డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు, కండక్టర్ పని చేసే అనుభవం ఉన్న వారు నేరుగా తమ సమీపంలోని డిపోలను సంప్రదించవచ్చు. డిపో మేనేజర్లు దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వారిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్లతో నడుపుతుండగా, కొత్త నియామకాలతో సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను కూడా వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. సమ్మె కాలం ముగిసే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ తాత్కాలిక నియామకాలు కొనసాగుతాయి. ఆయా డిపోల ఫోన్ నెంబర్లు,హెల్ప్ లైన్ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఆసక్తి గల వారు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, లైసెన్స్‌తో డిపో కార్యాలయాలకు వెళ్లాలని కోరుతున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu