హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ప్రాంతంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న వ్యక్తి చేతిలోంచి ఆకతాయిలు ఫోన్ లాక్కునేందుకు యత్నించగా అది కింద పడి పగిలిపోయింది. ఈ తతంగాన్ని వెనుక వస్తున్న మరో వాహనదారుడు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసి పైశాచికానందం పొందుతున్న ఇలాంటి పోకిరీలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న వీడియోను నెటిజన్లు హైదరాబాద్ సిటీ పోలీసులకు, కమిషనర్ సజ్జనార్‌కు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్యాగ్ చేశారు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించారు. సుల్తాన్ బజార్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆకతాయిలు వాడిన వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నామని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
0 Comments