Ad Code

వాట్సప్‌లో కొత్త ఫీచర్ : ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ సర్వీస్


దేశీయ వినియోగదారులకు వాట్సాప్ ఇప్పుడు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్ సర్వీస్ అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను పేయూ సహకారంతో రూపొందించారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. మెటా, పేయూ కలిసి తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల నంబర్లకు కూడా రీచార్జ్ చేయవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వీఐ ప్రీపెయిడ్ వినియోగదారులు అందుబాటులో ఉన్న ప్లాన్లలోంచి ఎంచుకుని నేరుగా వాట్సాప్‌లోనే రీచార్జ్ పూర్తి చేయవచ్చు. యాప్ హోమ్ స్క్రీన్‌లో కొత్తగా రూపాయి చిహ్నం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా పేమెంట్స్, రీచార్జ్ సేవలు వేగంగా చేరుకోవచ్చు. ఇదే చిహ్నంతో యూపీఐ పేమెంట్స్, మెట్రో టికెట్ బుకింగ్ సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. మెటా ఇండియా బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ రవి గార్గ్ మాట్లాడుతూ, భారతదేశంలో వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు, రోజువారీ అవసరాల పనులు కూడా ఇక్కడే జరుగుతున్నాయి అన్నారు. రీచార్జ్ సదుపాయం నేరుగా వాట్సాప్‌లో రావడంతో వినియోగదారులు అనేక యాప్‌ల మధ్య తిరగాల్సిన అవసరం తగ్గుతుంది అన్నారు. పేయూ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హేమంగ్ దత్తాని మాట్లాడుతూ, రోజువారీ డిజిటల్ చెల్లింపులు సులభం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం అన్నారు. వాట్సాప్ ఇప్పటికే అందరి జీవితంలో భాగమైపోయింది. మొబైల్ రీచార్జ్ కూడా తరచూ చేసే పని. అదే యాప్‌లో చేయగలగడం వినియోగదారులకు చాలా సౌకర్యం ఇస్తుంది అన్నారు. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే వినియోగదారులు ముందుగా ₹ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. తర్వాత మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్ ఎంపిక చేసుకోవాలి. నంబర్ ఎంచుకోవాలి. టెలికాం ఆపరేటర్‌ను నిర్ధారించాలి. తరువాత ప్లాన్ ఎంచుకుని యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి.

Post a Comment

0 Comments

Close Menu