Ad Code

ఇస్తాంబుల్‌లోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌పై కాల్పులు : ముగ్గురు దుండగులు హతం


ర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ దగ్గర కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముగ్గురు దుండగులను హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. టర్కీ మీడియా ప్రకారం ముగ్గురు దుండగులు ప్రాణాంతకమైన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ కాన్సులేట్ వెలుపల కాల్పులకు పాల్పడ్డారని దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నట్లు తెలిపింది. ఈ కాల్పుల ఘటనపై ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించిందని టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ చెప్పినట్లు టీఆర్టీ వరల్డ్ పేర్కొంది. దౌత్య వర్గాల నివేదిక ప్రకారం ప్రస్తుతం టర్కీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలెవరూ లేరని పేర్కొన్నాయి. ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్‌లో గానీ అలాగే అంకారాలోని రాయబార కార్యాలయంలో గానీ ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఎవరూ లేరని సమాచారం. ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu