జూ నుంచి తప్పించుకున్న తోడేలు : రంగంలోకి దిగిన దక్షిణ కొరియా సైన్యం


క్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో ఉన్న జూ నుంచి గత వారం న్యూగు అనే తోడేలు తప్పించుకుంది. జూ చుట్టూ ఉన్న ఇనుప కంచెకు కన్నం చేసి పారిపోయింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తిని పెంచాయి. తోడేలు వేట ఏ స్థాయికి చేరిందంటే దాని పేరుతో క్రిప్టో కాయిన్ తరహాలో మీమ్ కాయిన్ తయారైంది. జూ నుంచి తప్పించుకున్న తోడేలుని పట్టుకునేందుకు 300కి పైగా అగ్నిమాపక విభాగపు అధికారులు, సైనికులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ వాళ్లెవరికీ దొరక్కుండా న్యూగు వారం రోజులుగా తప్పించుకు తిరుగుతోంది. కొన్నిసార్లు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకుంది. తప్పించుకున్న తర్వాతి రోజు జూ పక్కనే ఉన్న థీమ్‌పార్క్‌లో అమర్చిన థర్మల్ ఇమేజింగ్ కెమెరాల్లో చిక్కింది. పార్క్ పక్కనే ఉన్న ఆకుపచ్చ పొదల్లో మెరుస్తున్న ముద్దలా కనిపించింది. అధికారులు డ్రోన్ సాయంతో తోడేలు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే డ్రోన్ బ్యాటరీ అయిపోవడంతో బ్యాటరీ మార్చే సమయంలో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి మరోసారి దాని ఆచూకీ తెలిసింది. డేజియోన్ ఓ వరల్డ్ నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ కొండ మీద తోడేలు కనిపించిందని స్థానిక ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది. రోడ్ల మీద వాహనాల హెడ్‌లైట్ల కాంతిలో చీకట్లోకి వెళుతున్న తోడేలు వీడియోను ఎవరో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో అధికారులకు చేరడంతో పదుల సంఖ్యలో పోలీసులు మిలటరీ డ్రోన్లు తీసుకుని వెదకడం ప్రారంభించారు. తోడేలు ప్రతీసారి దొరికినట్లే దొరికి కనిపించకుండా పోయింది. పోలీసులు డ్రోన్లతో వెదకడం మొదలు పెట్టిన తర్వాతి రోజు ఉదయం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. న్యూగు కోసం వెదుకులాట దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడంతో స్థానిక ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తున్నారు. న్యూగు జూ నుంచి తప్పించుకున్న తర్వాతి రోజు దాన్ని చూసినట్లు అనేకమంది అధికారులకు చెప్పారు. అలా చెప్పిన వారిలో కుక్కలను చూసి అదే తోడేలుగా భావించిన చిన్న పిల్లలు ఉన్నారని స్థానిక పత్రికలు రిపోర్ట్ చేశాయి.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains