Ad Code

మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా అవతరించిన న్యూజిలాండ్


న్యూజిలాండ్ మహిళా జట్టు మహిళల క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి భారత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. మహిళ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం గమనార్హం. మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో రెండో మ్యాచ్ కివీస్‌కి తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండో వన్డేలో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మహిళా జట్టు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ మ్యాచ్‌లో 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి విజయం సాధించింది. కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి.. జట్టుకు విజయాన్ని అందించింది. 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సుతో 179 పరుగులు చేసి.. తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కెర్‌కి ఇసాబెల్లా గేజ్(68) సహకారం అందించింది. మిగితా వారెవరూ పెద్దగా స్కోర్ చేయకపోయినా కెర్ మాత్రం చివరి వరకూ పోరాడి జట్టును గెలిపించింది. దీంతో మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య చేధన చేసిన జట్టుగా అవతరించింది. 

Post a Comment

0 Comments

Close Menu