Ad Code

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు : భారీ స్థాయిలో నిధులు వసూలు ?


ఫోక్ సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు మరికొందరిపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారీ స్థాయిలో నిధులు వసూలు చేసి మోసం చేయడమే కాకుండా, బాధితులను బెదిరించినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి. న్యాయవాది సుబ్బారావు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి రూ.కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగాబాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu