Ad Code

నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన హర్షిత్ భట్ ?


త్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో పడి 23 ఏళ్ల హర్షిత్ భట్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. తొలుత ఇదొక ప్రమాదంగా భావించినప్పటికీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు మరో మలుపు తిరిగింది. తన కొడుకును స్నేహితులే పథకం ప్రకారం చంపేశారని తల్లి ఆరోపణలు చేయడంతో, ఆ ముగ్గురు స్నేహితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్షిత్ ఇందిరాపురంలో ఉంటూ సెక్టార్ 125లోని అమిటీ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. బుధవారం  ఆరవ సెమిస్టర్ చివరి పరీక్ష రాసిన అనంతరం.. స్నేహితులు వ్యాస్, క్రిష్, హిమాన్షులతో కలిసి సెక్టార్ 94లోని సూపర్ నోవా భవనం వెనుక వైపు ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆగిపోయిన ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ స్థలంలో బేస్మెంట్ కోసం తవ్విన భారీ గుంతలో నీరు నిలిచి ఉంది. ప్రహరీ గోడ గుండా వారు లోపలికి ప్రవేశించారు. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వీరంతా ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పరీక్షకు ముందు, ఆ తర్వాత కూడా వీరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గుంత దగ్గర బీర్ క్యాన్లు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వీరు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆ నీటి గుంతలోకి దిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. 

Post a Comment

0 Comments

Close Menu