అసూస్ ఎక్సపర్ట్ బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్‌ విడుదల


దేశీయ మార్కెట్లో అసూస్ ఎక్సపర్ట్ బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రొఫెషనల్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు . తేలికైన, సొగసైన డిజైన్‌, ఆధునిక టెక్నాలజీతో ఈ ల్యాప్‌టాప్‌ వ్యాపార అవసరాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది. దీని ప్రధాన లక్ష్యం పోర్టబిలిటీ, విశ్వసనీయత, లాంగ్ టైం పెర్ఫార్మన్స్ ను అందించడం. ప్రొఫెషనల్‌ వర్క్‌లోడ్‌లను సులభంగా నిర్వహించగలిగేలా రూపొందించబడిన ఈ డివైస్‌ రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌ ప్రొఫెషనల్స్ కు పవర్ఫుల్ , తేలికైన నమ్మదగిన ల్యాప్‌టాప్‌ గా నిలుస్తూ ఆధునిక యూజర్లకు కొత్త అనుభవాన్ని అందించనుంది .ఈ ల్యాప్‌టాప్‌ Windows 11 Pro లేదా Windows 11 Home ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తుంది. Intel Core Ultra X7 , Ultra 5 ప్రాసెసర్‌ ఆప్షన్లతో ఇది పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ను అందిస్తుంది. Intel Arc B390 గ్రాఫిక్స్‌, Intel AI Boost NPU, LPDDR5X RAM (64GB వరకు) సపోర్ట్‌తో ఇది ఆధునిక AI వర్క్‌లోడ్‌లను సులభంగా నిర్వహిస్తుంది. 14-అంగుళాల Tandem OLED డిస్‌ప్లే HDR True Black 1000, Pantone Validated కలర్‌ యాక్యురసీ, Gorilla Glass Victus ప్రొటెక్షన్‌తో visuals అద్భుతంగా ఉంటాయి. స్టోరేజ్‌ ఆప్షన్లలో PCIe 4.0 SSD (512GB) , PCIe 5.0 SSD (1TB/2TB) ఉన్నాయి. I/O పోర్ట్స్‌లో Thunderbolt 4, USB 3.2 Gen 2 Type-A, HDMI 2.1, 3.5mm ఆడియో జాక్‌ ఉన్నాయి. 1080p FHD IR కెమెరా Windows Hello సపోర్ట్‌తో వస్తుంది. 6 స్పీకర్లు Dolby Atmos ఆడియోతో, Wi-Fi 7 , Bluetooth 6.0 కనెక్టివిటీతో వస్తుంది . 70Wh బ్యాటరీ 19 గంటల వరకు లాంగ్‌ లాస్టింగ్‌ యూజ్‌ అందిస్తుంది. MyASUS , MyExpert యాప్స్‌తో ప్రొడక్టివిటీ సపోర్ట్ ఉంటుంది . US MIL-STD 810H సర్టిఫికేషన్‌ durabilityను నిర్ధారిస్తుంది. సెక్యూరిటీ ఫీచర్లలో TPM 2.0, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ-కోర్ PC, ప్లుటోన్ సెక్యూరిటీ ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR Webcam ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ రెండు కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి Morn Grey , Jet Fog. ఇవి రెండూ కలర్స్ ప్రొఫెషనల్‌ లుక్‌ను కలిగించేలా డిజైన్‌ చేసారు . 1,49,990 ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. ఇది ప్రీమియం బిజినెస్‌ ల్యాప్‌టాప్‌ సెగ్మెంట్‌లోకి వస్తుంది. ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి, అధికారిక విక్రయాలు ఏప్రిల్‌ 29 నుండి ప్రారంభం కానున్నాయి. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains