Ad Code

మౌనిక హత్య కేసు : స్నేహితుడి ఫ్లాట్లో చంపి, తన ఫ్లాట్లో ముక్కలుగా కోసిన రవీంద్ర


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్న గాజువాకలో జరిగిన మౌనిక  హత్య కేసులో పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్ర, మౌనికను ఎలా అంతమొందించాడో స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సందర్భంగా పోలీసులు వివరాలను వెల్లడించారు. మార్చి 29న తన స్నేహితుడు ఉదయం ఏడు గంటలకు డ్యూటీకి వెళ్లగా, అతని ఇంటి తాళాలు తీసుకున్న రవీంద్ర, అది తన సొంత ఫ్లాట్ అని నమ్మించి మౌనికను అక్కడికి తీసుకెళ్లినట్లుగా నిందితుడు వెల్లడించాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, మౌనిక కేకలు వేయకుండా రవీంద్ర ఆమె నోరు మూసివేసి, గొంతుపై మోకాలితో బలంగా నొక్కి ప్రాణాలు తీశానని ఒప్పుకున్నాడు. హత్య చేసిన అనంతరం రవీంద్ర తన సొంత ఫ్లాట్‌కు వెళ్లి ఒక ట్రాలీ బ్యాగ్‌ను తీసుకొచ్చి, మౌనిక మృతదేహాన్ని ఆ బ్యాగ్‌లో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా తన ఫ్లాట్‌కు తరలించాడు. రవీంద్ర మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ తర్వాత శరీర భాగాలను జీడితోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ హత్య జరిగిన ఫ్లాట్ రవీంద్ర స్నేహితుడిదే అయినప్పటికీ, అక్కడ హత్య జరిగిన విషయం అతనికి తెలియదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడు రవీంద్ర ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Post a Comment

0 Comments

Close Menu