Ad Code

గురుకులంలో బాలుని హత్య : మేనమామే నిందితుడు


త్తరప్రదేశ్, కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతం గురుకులంలో విద్యనభ్యసించడానికి వెళ్లిన 11 ఏళ్ల దివ్యాంష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆ బాలుడి శరీరంపై ఏకంగా 42 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. వీపు, చేతులు, కాళ్లు మరియు ఛాతీపై లోతైన గాయాలు ఉన్నాయి. బాలుని శరీరంపై 11 చోట్ల సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా బయటపడ్డాయి. దివ్యాంష్‌ను అతని తల్లిదండ్రులు ఏప్రిల్ 15న లక్నోలోని రామానుజ్ భాగవత్ వేద విద్యాపీఠం గురుకులంలో చేర్పించారు. ఈ గురుకులాన్ని దివ్యాంష్‌కు వరసకు మేనమామ అయ్యే సౌరభ్ మిశ్రా అలియాస్ కన్హయ్య నడుపుతున్నాడు. తాము నమ్మిన వ్యక్తే తమ బిడ్డకు కాలయముడు అవుతాడని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. గత మంగళవారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు సౌరభ్ ఆ బాలుడిని గంటల తరబడి ఎండలో నిలబెట్టాడని, రాత్రంతా చెంపదెబ్బలు, కర్రలతో కొట్టాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నిందితుడు గట్టిగా తన్నడంతో బాలుడు ఎదురుగా ఉన్న గోడకు బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత నిందితుడు బాలుడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బుధవారం వచ్చి చూసేసరికి దివ్యాంష్ మరణించి ఉన్నాడు. దీంతో బాలుడికి ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఏదైనా భారీ వస్తువుతో పదేపదే కొట్టడం వల్ల బాలుడికి అంతర్గత గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది. అయితే, బాలుడిపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో, శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. నిందితుడు సౌరభ్ పోలీసులతో మాట్లాడుతూ దివ్యాంష్ గురుకుల నియమాలను పాటించడం లేదని, చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని, అందుకే దండించానని సాకులు చెబుతున్నాడు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితుడు తన ప్రియురాలు ప్రియాంక సహాయంతో గురుకులంలోని సీసీటీవీ ఫుటేజీని తొలగించాడు. పోలీసులు ప్రియాంకను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు సౌరభ్ మిశ్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu