Ad Code

ఇన్ఫోసిస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కార్లోస్‌ అల్కరాజ్‌


డుసార్లు గ్రాండ్‌ శ్లామ్‌ చాంపియన్‌గా నిల్చిన టెన్నిస్‌ దిగ్గజం కార్లోస్‌ అల్కరాజ్‌ని ఇన్ఫోసిస్‌ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనితో పాటు ఏఐ ఆధారిత మ్యాచ్‌ అనలిటిక్స్, మ్యాచ్‌ల కోసం సన్నద్ధం కావడానికి వ్యక్తిగత స్థాయిలో పనితీరును మదింపు చేసేందుకు ఉపయోగపడే అప్లికేషన్‌ని ఆయన తో కలిసి తమ ఏఐ సాంకేతికత టొపాజ్‌ సహా యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. అలాగే సామాజిక ప్రయోజనాల కోసం టెక్నాలజీని ఉపయోగించుకునే దిశగా ఇన్ఫోసిస్, అల్కరాజ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఏఐ ద్వారా టెన్నిస్‌ స్థాయిని మరింతగా పెంచాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఆయనతో భాగస్వామ్యం కీలకమని ఇన్ఫోసిస్‌ తెలిపింది. 

Post a Comment

0 Comments

Close Menu