టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉద్యోగులెవరూ క్యాంపస్‌కు రావద్దని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జరిగిన దారుణాలపై టీసీఎస్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. లైంగిక వేధింపుల విషయంలో తమది 'జీరో టాలరెన్స్' పాలసీ అని స్పష్టం చేస్తూ, నిందితులుగా తేలిన వారిని తక్షణమే సస్పెండ్ చేసింది. పోలీసు దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. యూనిట్ మూసివేతతో వేలమంది ఉద్యోగుల పనిపై ప్రభావం పడటంతో, వారికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' లేదా ఇతర యూనిట్లకు షిఫ్ట్ చేసే యోచనలో కంపెనీ ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ, షారూఖ్ ఖురేషీ, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమన్ మరియు ఒక మహిళా ఆపరేషన్ మేనేజర్ ఉన్నారు. మత మార్పిడికి ఒత్తిడి తీసుకురావడం వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? విదేశాల నుంచి అక్రమ నిధులు అందుతున్నాయా? అన్న కోణంలో పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను జల్లెడ పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 2022 నుంచి మహిళా ఉద్యోగులు హెచ్‌ఆర్ విభాగానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా, నిదా ఖాన్ మరియు తౌసిఫ్ అత్తార్ వంటి వారు వాటిని తొక్కిపెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు ధైర్యంగా ముందుకు రావడంతోనే ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులు ఇప్పటికే 70కి పైగా అంతర్గత ఈమెయిల్స్, నిందితుల చాట్ హిస్టరీ, కీలకమైన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
0 Comments