బెంగళూరులోని సిలికాన్ వ్యాలీలో వెలుగుచూసిన ఈ ఉదంతం, ఆధునిక జీవనశైలి పేరిట కొందరు వ్యక్తులు ఏ స్థాయి వికృత పోకడలకు అలవాటు పడుతున్నారో కళ్లకు కడుతోంది. ఒక భార్య తన విలాసవంతమైన అలవాట్లు, హై-ప్రొఫైల్ పార్టీల కల్చర్ కు బానిసై, చివరకు తన సంసారాన్ని ఒక లైంగిక ప్రయోగశాల గా మార్చేసింది. పబ్బులు, పార్టీల మోజులో పడిన ఆమె, తన భర్తను కూడా ఆ వికృత ప్రపంచంలోకి బలవంతంగా లాగింది. సామూహిక శృంగారం కోసం ఆమె తన మహిళా స్నేహితులతో పాటు మగ స్నేహితులను కూడా ఇంటికి పిలిపించి, భర్తపై విపరీతమైన ఒత్తిడి తెచ్చేది. చివరికి విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులోని అత్యంత భయంకరమైన కోణం ఏమిటంటే ఆ భార్య కేవలం వికృత చేష్టలతో ఆగకుండా, తన భర్తను తన స్నేహితులతో కలిసి శృంగారంలో పాల్గొనేలా చేసి, ఆ దృశ్యాలను వీడియోలుగా చిత్రీకరించేదట. ఆ ప్రైవేట్ వీడియోలను తన ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేస్తూ, వికృత ఆనందాన్ని పొందేదని భర్త పోలీసుల ముందు వాపోయాడు. అభ్యంతరకరమైన ఈ వీడియోల ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, తన ఆత్మగౌరవాన్ని బజారున పడేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఆరోపణలు ఇప్పుడు ఐటీ కారిడార్లోని విలాసవంతమైన జీవనశైలిపై చర్చకు దారితీశాయి. అయితే, ఈ ఫిర్యాదు వెనుక ఉన్న వాస్తవాలపై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భర్త చేసిన ఆరోపణలు వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ, అసలు నిజానిజాలు ఏమిటన్నది సాంకేతిక ఆధారాల ద్వారానే తేల్చాలని వారు భావిస్తున్నారు. ఆ దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు ఉన్నాయని, గొడవల్లో భాగంగానే భార్యపై ఇలాంటి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త చెబుతున్న వీడియోలు నిజంగా ఉన్నాయా? లేదా అనేది తేల్చేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహకారం తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు, సదరు మహిళను, ఆమె స్నేహితులను విచారించే పనిలో ఉన్నారు. ఒకవేళ భర్త చేసిన ఆరోపణలు నిజమైతే, అది చట్టపరంగా తీవ్రమైన నేరం అవుతుంది. అలా కాకుండా, కేవలం వ్యక్తిత్వ హననం కోసమే ఈ ఫిర్యాదు చేసి ఉంటే భర్తపై కూడా చర్యలు తప్పకపోవచ్చు. ఏది ఏమైనా, బెడ్ రూమ్ లోని రహస్యాలను బజారున పడేసిన ఈ కేసు, ఆధునిక దంపతుల మధ్య దెబ్బతింటున్న నైతిక విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది.
0 Comments