ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా కద్రి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు కారు పార్క్ చేసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు ఒక ప్రాణాన్ని బలిగొంది. తన మనవడు నడుపుతున్న మహీంద్రా థార్ కారు వెనుక చక్రాల కింద నలిగి ఒక వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ భయంకరమైన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితురాలి మనవడు తన మహీంద్రా థార్ వాహనాన్ని పార్క్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో వృద్ధురాలు కారు వెనుక వైపు గోడకు ఆనుకుని నిలబడి ఉంది. కారును వెనక్కి తీస్తున్న క్రమంలో మనవడు అదుపు కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా వేగంగా రివర్స్ అయింది. దీంతో ఆ వృద్ధురాలు కారుకు, వెనుక ఉన్న గోడకు మధ్యలో చిక్కుకుని నలిగి ప్రాణాలు కోల్పోపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కారు నడుపుతున్న వ్యక్తికి సరైన అవగాహన లేకపోవడం లేదా యాక్సిలరేటర్‌పై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments